Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSArmoorఆడుకునే చిన్నారులపై వీధి కుక్కల దాడి...

ఆడుకునే చిన్నారులపై వీధి కుక్కల దాడి…

ఆడుకునే చిన్నారులపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ ఘటన ఆర్మూర్ లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీ ప్రాంతంలో ఇంటి ఆవరణలో అడుచుండగా వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి.

చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. కుక్కల బెడద పై ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ కు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!