HomeTelanganaNizamabadకాంగ్రెస్ లో కనిపించని ఎమ్మెల్సీ సన్నద్ధం .....ఇంకా లో జిల్లాలో ఎంట్రీ ఇవ్వని అభ్యర్థి ......చొరవ...

కాంగ్రెస్ లో కనిపించని ఎమ్మెల్సీ సన్నద్ధం …..ఇంకా లో జిల్లాలో ఎంట్రీ ఇవ్వని అభ్యర్థి ……చొరవ చూపని డీసీసీ

ఏడాది పాలన తరవాత వచ్చిన శాసన మండలి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కార్య క్షేత్రంలో కి రావడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అనివార్యం కానీ అందుకు తగ్గా కార్యచరణ కు సిద్ధం చేసుకోలేక పోతుంది.

ఆర్థిక ,సామాజిక నేపథ్యంలో బలమైన అభ్యర్థి నే రంగంలోకి దించింది. ఓ వైపు నామినేషన్ ల పక్రియ సైతం మొదలైంది. అయినా అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికు సంబందించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు.

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇంకా జిల్లా వైపు కన్నెత్తే చూడలేదు. ఎమ్మెల్సీ పట్టభద్ర నియోజకవర్గం పరిధి లో నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లా పరిధి లో 14 జిల్లాలున్నాయి.

అందుకే ఈ ఎన్నికల నిర్వహణ ను అభ్యర్థి ఒక్కడే మీదేసుకొని పనిచేయడం అంత సులువేమి కాదు. స్థానికంగా ఉన్న నాయకత్వమే క్రియాశీలకంగా పనిచేయాల్సి వుంటుంది. ఉమ్మడి జిల్లాలో తొమ్మది సెగ్మెంట్ లుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయిదుగురు ఉన్నారు.

కానీ ఎమ్మెల్యే ల మధ్య కనీస సమన్వయం లేదు అదే ఈ ఎన్నికకు ప్రతికూలంగా మారింది.అభ్యర్థి కి ఎమ్మెల్యే ల మధ్య వారధి ఉండాల్సిన డీసీసీ ఈ వ్యవహారంలో కనీస చొరవ చూపడం లేదు.

పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక లో సానుకూల ఫలితాలు సాధించాలంటే నేతలు కల్సి కట్టుగా శ్రమించాల్సిందే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments