మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 6 గురికి జైలు శిక్షా, 11 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ పేర్కొన్నారు.
శుక్రవారం 17 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 11 మందికి 15500 /- జరిమానా విధించారు. టి సంతోష్, షేక్ సైద్, సిర్నపల్లి అనిల్, విఠోబా, అనిల్, షేక్ ఇమామ్ అలీ వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడిపినచో చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
