పోలీసులు దర్యాప్తు ప్రారంభంఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో అనుమానాస్పద పరిస్థితుల్లో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. శుక్రవారం అర్థరాత్రి సంపంగి నరసయ్య (41) అనుమానాస్పదంగా తన ఇంట్లో ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. నరసయ్య సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మృతుడి మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నరసయ్య మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్థుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరితగతిన నిజాన్ని వెలుగులోకి తీసుకువస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
