ఢిల్లీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనిల్ శర్మ, తర్విందర్ సింగ్ మర్వాను ఎంపీ అర్వింద్ ధర్మపురి సన్మానించారు.
ఆయన ఇన్ ఛార్జిగా ఉన్న అసెంబ్లీ స్థానాలు ఆర్కే పురంలో అనిల్ శర్మ, జంగ్పురాలో తర్విందర్ సింగ్ విజయం సాధించారు.
దీంతో అర్వింద్ వారిని కలిసి అభినందించారు. బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
