తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం గత కొద్దీ రోజులుగా సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యాక ప్రజాక్షేత్రంలో చురుకుగా పనిచేసిన ఈ మధ్య వెనక్కి తగ్గారు.అధికార పార్టీ తో ఆయన కు క్రమేపి దూరం పెరుగుతుంది. ఎమ్మెల్సీ పదవీ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపు కుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన సారథ్యం లోని టీజేఎస్ పార్టీకి ఇచ్చిన హామీ లను గాలికి వదిలేసింది. నామినేటెడ్ పోస్టులఉసుత్తెడం లేదు.ప్రజాక్షేత్రంలో టీజేఎస్ పార్టీ బలం నామ మాత్రమే కావచ్చు ! కానీ కెసిఆర్ లాంటి దిగ్గజ నేత ఎదుర్కోవడానికి ఉద్యమ సారథి గా ప్రొపెసర్ కోదండరాం మద్దతు తీసుకొవడం కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా భావించింది.
అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తో అవగాహన కు వచ్చింది. టిజెఎస్ ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేయడానికి సిద్ధం అయింది కానీ డిల్లీ పెద్దలు వారించారు కోదండరాం తో నేరుగా టచ్ లోకి వెళ్ళింది. కెసిఆర్ సర్కార్ ను గద్దె దించడం లక్ష్యంగా భావించి కాంగ్రెస్ తో రాజీ పడ్డారు.
అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు కుంతియా లు వెళ్లి కోదండరాం మద్దతు కూడగట్టారు. అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాలే కాదు ఏడు నామినేటెడ్ ఛైర్మెన్ లు ఇస్తామని లిఖిత పూర్వకంగా నమ్మబలికింది.
దీనితో ఆ పార్టీ క్యాడర్ లోనూ సైతం కొత్త జోష్ వచ్చింది. షబ్బీర్ అలీ లాంటి నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో మూడు డివిజన్ లు టీజేఎస్ కే కేటాయిస్తామని మాటఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసలు కోదండరాం కు ఎమ్మెల్సీ ఇవ్వడానికే మీన మేషాలు లెక్కించింది.
ఆ తరవాత రేవంత్ చొరవ తీసుకోని గవర్నర్ కోట లో ఎమ్మెల్సీ పదవీ ఇచ్చినా న్యాయ పరమైన వివాదం తో ఆ పదవీ దక్కడానికి ఆరు నెలలు జాప్యం జరిగింది. మరో వైపు నామినేటెడ్ పోస్టు ల విషయంలో రేవంత్ టీజేఎస్ పార్టీ కి ఇచ్చిన హామీ ని గాలికి వదిలేసారు.
మొదట్లో ప్రభుత్వ వ్యవహారాల్లో కోదండరాం క్రియ శీలంగా ఉన్నట్లు అనిపించినా ఆతర్వాత ఆయన ప్రమేయం తగ్గిస్తూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తో కలవడానికి ఆయనకి అవకాశం దక్కని పరిస్థితి వచ్చింది ఏదైన విషయం చెప్పలన్న వేం నరేందర్ రెడ్డి చెవిలో వేయడం వరకే పరిమితం అయ్యారు.
ఎమ్మెల్సీ గా నియామకం అయ్యాక కోందండరాం ఫై క్యాడర్ లో ఉద్యమ కారుల్లో ఉద్యోగ వర్గాల్లో అంచనాలు పెరిగాయి తమ గోడు చెప్పుకుంటే ప్రభుత్వం పని అవుతుందనే భరోసా వచ్చింది. కానీ మంత్రులు ఉన్నత స్థాయి యంత్రాంగంలో ఆయన అర్జీ లకు కనీస ప్రాధాన్యత లేకుండా పోయింది.
పార్టీ నేతలకు పదవుల పందేరం సంగతి ఎలా ఉన్న ఎమ్మెల్సీ గా ఉన్న తనకు సరైన రీతిలో ప్రభుత్వంలో ప్రాబల్యం లేక పోవడంఫై కోదండరాం సైతం లోలోపల నొచ్చుకుంటున్నారు ఉద్య సహచరులతోను అదే ఆవేదన వెళ్లగక్కుతూ వస్తున్నారు.
కానీ అదికార పార్టీ ని ఏదైన అంటే వివాదం అవుతుందని ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ గా వుంటున్నారు. తాను గట్టిగా గొంతెత్తే పరిస్థితి కూడా ఆయనకు ఇప్పుడు లేకుండా పోయింది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్ట లేక పోతున్నారు. పార్టీ ప్రభుత్వ పెద్దల ను స్వయంగా కల్సి దిద్దుబాటు చర్యల ప్రస్తావన చెయ్యాలనుకున్నా వృధా ప్రయాసా అయింది.భవిష్యత్తు కార్యాచరణ కోసం ఆయన ఆదివారం టీజేఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నాంపల్లి కార్యాలయంలో నిర్వహించారు.
ఆయా జిల్లాల నుంచి ఉద్యమ నేతలు అధికార పార్టీ అనుసరిస్తున్న తీరు ఫై నిప్పులు చెరిగారు పార్టీలో కీలక నేతలు సైతం రగిలి పోయారు లోకల్ బాడీ ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాలిన్స విధానం మీద చర్చ లేకుండా సమావేశం ముగించారు.నిజానికి అసెంబ్లీ ఎన్నికల తరవాత పార్టీ కార్యకలాపాలను మందగించాయి.
లోకల్ బాడి తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాము ధమ్కీ ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే భవిష్యతు అడుగులు ఎటు వైపు వెయ్యలేనది ఉద్యమ నేత కు క్లిష్టంగా మారింది
