HomeTelanganaNizamabadనిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యం.... ఎస్ ఈ రవీందర్.

నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యం…. ఎస్ ఈ రవీందర్.

నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది దాంతో భాగంగా ఈరోజు 33 కెవి సంగం సబ్ స్టేషన్ కు ప్రస్తుతము 33 కెవి చిన్నపెంట ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా అందజేయడం జరుగుతుంది

ఈరోజు 33 కెవి రుద్రూర్ ఫీడర్ నుండి సంఘం సబ్స్టేషన్ వరకు 3.5 కిలోమీటర్ల లైన్తో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయడానికి జిల్లా ఎస్ ఈ రాపల్లి రవీందర్ చేతులమీదుగా అనుసంధానం చేయడమైనది.

జిల్లా ఎస్ ఈ రవీందర్ గారు మాట్లాడుతూ 33 కేవి రుద్రూర్ ఫీడర్ 30 లక్షల వ్యయంతో నిర్మాణం చేయడమైనది. రుద్రూరు ఫీడర్ ఏర్పాటు చేయడంతో రెండు 132 కె వి సబ్స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు 132 కెవి జాకోర మరియు కోటగిరి సబ్ స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరా తీసుకోవచ్చు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఇ టెక్నికల్ ఏ రమేష్ ,డి ఈ ఆపరేషన్ బోధన్ ఎండి ముక్తార్, డి ఈ కన్స్ట్రక్షన్ డి వెంకటరమణ, ఎడి ఈ ఆపరేషన్ కే నగేష్ కుమార్, ఎడి ఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏ ఈ రూరల్ బోధన్ మారుతి జె, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ శ్రీమతి ఆర్ సుమిత, ఎస్ ఎల్ ఐ డి సి రాజు, ఎల్ఐ శివప్రసాద్, మరియు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments