కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ తో కుమ్మక్కై కాంగ్రెస్ ఓటమి కోసం కలిసి పనిచేస్తున్నాయని పర్యాటక ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపణలు చేశారు.సోమవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఓటమి భయంతోనే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందని విమర్శించారు.గడిచిన 10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో ముంచిందని ద్వజమెత్తారు.
ఇక కేటీఆర్ హరీష్ రావు లు మతితప్పి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇక బీజేపీ పార్టీ ఎం తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రభుత్యం 10 సంవత్సరాల కాలంలో చేసిందేమీ లేదన్నారు.
అలాగే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు గుండుసున్న ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అదే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వేల కోట్ల నిధులు కేటాయించారు,అలాగే బీహార్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు లెక్కలేని నిధులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పథకాలు ఆలస్యం కావడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు.
గతం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు పడక నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒకటవ తేదీన జీతాలు పడుతున్నాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కుల గణన సర్వే పక్క జరిగిందని తెలిపారు.అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజ్వేషన్లు అమలు చేస్తానని హామీ చేశారు.
పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు,రూరల్ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
