తప్పి పోయిన వ్యక్తిని రైల్వే పోలీసులు వెతికి అతని బంధువులకు అప్పగించారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. నాందేడ్ పట్టణానికి చెందిన షైక్ బాబా ఆటో డ్రైవరు.
ఇతను కరీంనగర్ లోని తన చిన్న కూతురు ఇంటి నుంచి నాందేడ్ కు బయలుదేరుటకు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి రైలులో బయలుదేరి నిజామాబాదు రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడి నుండి కనిపించక పోయాడు.
దీనిపై అతని యొక్క కూతరు దరఖాస్తు ఇవ్వగ వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి స్పెషల్ టీంను ఏర్పాటు చేసి అతని గురించి వాకబు చేయగా నిజామాబాదు నుండి ట్రైన్ లో నాందేడ్ కు అని బయలు దేరి నిద్రలో ముఖేడ్ రైల్వేస్టేషన్ లో దిగి తెలియక అక్కడే ఉండి పోయడం.
ఈమెరకు పోలీసులు ముఖేడ్ యందు సీసీ కెమెరాలు చెక్ చేయగా అక్కడ దిగినట్టు కనిపించగా అతనిని పట్టుకొని నిజామాబాదు రైల్వేస్టేషన్ కు తీసుక వచ్చి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.
