HomeCRIMEచాదర్‌ఘాట్‌ కేంద్రంగా యధేచ్చగా సాగుతున్న .......అక్రమ వెల్లుల్లి ప్రాసెసింగ్ దందా ........

చాదర్‌ఘాట్‌ కేంద్రంగా యధేచ్చగా సాగుతున్న …….అక్రమ వెల్లుల్లి ప్రాసెసింగ్ దందా ……..

చాదర్‌ఘాట్ ప్రాంతంఅక్రమ వెల్లుల్లి దందా కు అడ్డాగా మారింది.అధికారుల అండతో నే ఈ అక్రమ దందా గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది

చాదర్‌ఘాట్ చిన్న వంతెన వెనుక ఖాలీ స్థలంలో కొందరు ఇదో కుటీర పరిశ్రమ లా నడిపిస్తున్నారు. ఈ స్థలం నుండిముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వస్తుందని తాము అధికారులు పదే పదే చెప్తున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు.

వెల్లుల్లి ఫెస్ట్ తయారీ అయ్యాక వచ్చే వ్యర్థాలను సమీపంలో ని నాలా లోనే పడేస్తున్నారని అందులో నుంచి దుర్వాసన వల్లే తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు నిర్వాహకులు కాసులు కక్కర్తి కి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఈ ఫెస్ట్ తయారీ చేస్తున్నారు.

ఆహార లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేదా ఆహార ప్రాసెసింగ్ కోసం అవసరమైనఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందా బాహాటంగా సాగిస్తున్నారని వారు చెప్తున్నారు.కుళ్లిపోయిన అల్లం యెల్లిగడ్డ లను మిశ్రమంగా చేసి అందులో సువాసన వచ్చేలా రసాయనాలు కలిపి ఫ్యాక్ చేసి రిటేల్ మార్కెట్ లో యధేచ్చగా చెలామణి చేస్తున్నారని వారు అంటున్నారు

గతంలో, తాము అనేక పిర్యాదు లు చేస్తే అధికారులు పోలీసు సిబ్బంది తనిఖీ కోసం ఆ ప్రదేశాన్ని సందర్శించారు, కానీ ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోలేదని నిర్వాహుకులు నయానో భయానో ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు చర్య తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు .

అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ కల్తీ ఫెస్ట్ తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అలాగే ఈ ప్రాంతం లో వచ్చే దుర్వాసన తో తాము అనేక రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

తనిఖీ లకు వస్తున్న అధికారులు ఆ యూనిట్ నుంచి ఎలాంటి శాంపి ళ్లు తీసుకోవడం లేదని శాంపిళ్లు తీసుకుంటే కల్తీ బాగోతం బట్టబయలు అవుతుందని ఆ దిశగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments