గుర్తు తెలియని లారీ,కారును ఢీ కొనడంతో యువకుడు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం డిచ్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..
నిజామాబాద్ ఆటో నగర్ కు చెందిన అబ్దుల్ రహిమాన్ (28).మరో ముగ్గురు వ్యక్తులు కలిసి కారు లో హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో డిచ్ పల్లి పరిధిలోనీ బీబీపేట్ వద్ద గుర్తు తెలియని లారీ ఢీ కొట్టిందని తెలిపారు.
దీంతో కారు బోల్తా కొట్టి అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ రహిమాన్ (28) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
