HomeHEALTHప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత...పట్టించుకోని అధికారులు,పాలకులు.అరకొర సేవలపై మండిపడుతున్న రోగులు..

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత…పట్టించుకోని అధికారులు,పాలకులు.అరకొర సేవలపై మండిపడుతున్న రోగులు..

పేరుకే పెద్దా ఆసుపత్రి అక్కడ మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్న మందులే ఇస్తున్నారు.

ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు.బయట కొనుక్కోలేని పేదలను రోజుల తరబడి తిప్పుతున్నారని, ప్రత్యామ్నాయ మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండాల్సిన బీపీ, షూగర్‌ టాబ్లెట్లు రెండు నెలలుగా అందుబాటులో లేక రోగులు మందుల కోసం ఆస్ప త్రికి వచ్చి ఖాళీ చేతుల్తో వెళ్తున్నారు.

చాలా మంది మెడికల్‌ షాపుల్లో కొనుక్కొంటున్నారు. వైద్యులు సరిగా విధులు నిర్వర్తించక ఏ మందులు ఉన్నయో? ఏవి లేవో? తెలియని పరిస్థితి నెలకొంది. మందుల కోసం వచ్చే తమను వైద్యులు పట్టించుకోవడం లేదని పలువురు రోగులంటున్నారు. మందులు లేని ఆస్పత్రి ఎందుకని, ప్రభుత్వం మందులను సరఫరా చేస్తున్నా అధికారులే తెప్పించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలో ఎక్స్‌రే తీయించుకున్న వారికి కనీసం ఎక్స్‌రే ఫిలిం కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లో ఫొటో తీసి ఇదే ఎక్స్‌రే రిపోర్టు అని ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు.సర్కార్‌ ఆసుపత్రులే దిక్కుగా భావించే నిరుపేదలకు శాపంగా మారుతోంది. ప్రజా ప్రతినిధులు,

ఉన్నతాదికరులకు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 2 వేలకు పైగా ఔట్ పేషెంట్ లు వస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులను అద్బుతంగా అభివృద్ధి చేశా మనిషికి చెపుతున్నా అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం శాపంగా మారింది.

మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ ఆసుపత్రిలో అనేక సమస్యలు వెంటాడు తున్నాయి.ప్రతియేటా కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు వైద్య సేవలు అందించే ఈ సర్కారీ దవాఖానాలో మాత్రలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వకి చికిత్స కోసం వచ్చిన వారికి కనీస వసతులు కూడా కరువయ్యాయనీ రోగులు ఆవేదన వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments