వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే.
టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆద్వర్యంలో నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ లక్ష్మి ప్రియ నగర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఒక నిర్వాహకురాలు, ఇద్దరు బాధితులు,ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారినుంచి రూ.670 నగదు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు నిమిత్తం రూరల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.