Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadఈనెల 24న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న...

ఈనెల 24న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఉదయం 11 గంటలకు భూమి రెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

అలాగే ఈ నెల 27 న జరిగే శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులను విస్మరించిందన్నారు.

Sఅనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తాను రూ.30 కోట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఇచ్చానని,అలాగే ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైతే ఓటుకు రూ.2000 కూడా ఇస్తానని చెప్పిన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు నిజమో కాదో బిజెపి నాయకులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే సమావేశంలో మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!