ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిని నిజామాబాద్ నుంచి నిందితులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
మోపాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి స్నేహితులతో కలిసి ధర్పల్లి మండలంలోని ఓ తండాకు వెళ్లినట్టు తెలుస్తోంది. నల్లగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లిన అనంతరం మద్యం సేవించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులు మరో యువతి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుండగా అరుపులు కేకలు విన్న స్థానికులు అప్రమత్తం కావడంతో యువకుల పరారీ..
ఈ విషయమై బాధితురాలి సోదరి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిస్తోంది.
