కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందనీ పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదనీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరోపణలు చేశారు.నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని పసుపు మార్కెట్ యార్డును కవిత సందర్శించారు.
పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందనీ, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయనీ స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుంద తెలిపారు.
అలాగే వ్యాపారులంతా సిండికేట్‌గా మారి పసుపు ధర తగ్గిస్తున్నార ద్వజమెత్తారు. నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.
ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదు. పసుపునకు రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందనీ తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డుకు చట్టబద్ధత, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందనీ హెచ్చరించారు.అలాగే దీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదనీ దుయ్యబట్టారు.
మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్‌ను దిగ్భందిస్తాం’ అని హెచ్చరించారు.బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా అంటూ ధ్వజమెత్తారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని నిలదీశారు.ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు.
చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రైతుల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపై ఉందా. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలనీ కోరారు.
తన విషయంలో మాట్లాడవద్దని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరులో మార్పు రాలేదు. బహుశా కోర్టు మరోసారి చివాట్లు పెట్టాలేమో. అప్పుడుగానీ మారరేమో అని తెలిపారు.
