తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కేసు నమోదవడంతో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఒక కేసు నమోదు కాగా.. రెండు, మూడు రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ప్ల్ వ్యాధి నిర్ధారణ అయ్యింద.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో పది రోజులుగా కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మృతి చెందిన కోళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కి తరలించి పరీక్షలు చేయగా.. వాటిలో ఒకటి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ జరిగింది. ఈ విషయం అధికారులు ధ్రువీకరించడంతో ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన మొదలైంది.
