గత కొన్ని సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్, బైక్ చోరి,ఇళ్లు దోపిడీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలిసులు పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన షేక్ ఇమ్రాన్, షేక్ అర్బస్, అమాస్ లు నాలుగవ టౌన్ పరిధిలోనీ బోర్గాం(పి) లోని మోటాటి రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి దుమాల లక్ష్మిభాయ్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనకనుంచి వచ్చి ఆమె మేడలో నుంచి పుస్తేలా తాడును బలవంతంగా తెంపుకుని ద్విచక్ర వాహనం పై నిజామాబాద్ పట్టణం వైపు పరారయ్యారు.
ఈమేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇఈ ట్టి దర్యాప్తు లో బాగంగా అధికారుల పర్యవేక్షణాలో నిజామాబాద్ టౌన్ 4 సబ్-ఇన్స్పెక్టర్ కె. శ్రీకాంత్ దర్యాప్తు చేయగా, తదుపరి దర్యాప్తులో బాగంగా సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నేరస్తులైన
1) షేక్ ఇమ్రాన్ @ అబ్బు,
2) షేక్ అర్బట్
మయా లను అరేబియన్ మండి, శ్రీనగర్ కాలనీ, దగ్గరలో అదుపులోకి తీసుకోని విచారించగా పై ముగ్గురు వ్యక్తులు నిజామాబాద్ నందు అరేబియన్ మండి, వినాయక్ నగర్, బాసర గ్రామంలో, బోర్గాం(p) గ్రామంలో, రాంచంద్రపల్లి గ్రామం, మాక్లూర్ మండలంలో, బాసర నందు చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారనీ తెలిపారు.
అలాగే నిర్మల్ జిల్లా, బైంసా, తానూర్, బాసర మండలాలలో బైక్ దొంగతనాలు మరియు ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ నందు ఇళ్లు దోపిడి నేరం చేసినట్లు ఒప్పుకున్నారు.ముగ్గురు నిందితులపై మూడు జిల్లాలలో మొత్తం 08 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
ఈ మేరకు శనివారం పట్టుకొని వారి నుంచి 50 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనం రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసు చేదనలో నిజామాబాద్ టౌన్ సిఐ జి. శ్రీనివాస్ రాజ్ , సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్, నాల్గవ టౌన్ ఎస్ఐ కే. శ్రీకాంత్, మరియు వారి సిబ్బందిని గౌరవ నిజామాబాద్ ఏసిపి అభినందించినారు.
