నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుల గుట్టు రట్టయింది. ఎట్టకేలకు పోలిసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఆసీపీకర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా వెంకటరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం…
ఈ నెల 6వ తేదిన నగరంలోని మూడవ టౌన్ పరిధిలోనీ నందేవాడలోని శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ లో అర్థరాత్రి షేక్ షాదిక్, సురేఖర్ ప్రకాష్,సయ్యద్ సదుల్ల,సాయినాథ్ విఠల్ రావు,లు నలుగురు కలిసి బాలాజీ ట్రాన్స్పోర్ట్ లో చొరబడి బీరువా తాళం పగల గొట్టి రూ 10,27,250 నగదు అపహరించి పరారయ్యారు.
ఈ మేరకు షాప్ యజమాని నాగురి నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, సీసీఎస్ సీఐ సురేష్,ఎస్ఐ హరిబాబు ఆద్వర్యంలో విచారణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు,దుబ్బ ప్రాంతంలో నలుగురు కలిసి ఆటో లో వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు.
గతంలో వీరిపై నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో సుమారు 40 కి పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఈ కేసును ఛేదించిన టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, సీసీఎస్ సీఐ సురేష్,ఎస్ఐ హరిబాబు,సిబ్బందిని అభినందించారు.
