HomeTelanganaNizamabadమైనింగ్ జరిమానా లకు వన్ టైం సెటిల్మెంట్ ........బ్లా లిస్టు లో నుంచి తొలగింపు ........ఖజానా...

మైనింగ్ జరిమానా లకు వన్ టైం సెటిల్మెంట్ ……..బ్లా లిస్టు లో నుంచి తొలగింపు ……..ఖజానా భారీగా ఆదాయం సమకూరే ఛాన్స్ ……

అక్రమ మైనింగ్ లకు పాల్పడి భారీ జరిమానాలను విధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్గించే ఆదేశాలు జారీచేసింది.. జరిమానా లను వన్టైం సెటిల్మెంట్ చేసుకునే ఆ మొత్తం ను తగ్గేలా వెసులుబాటును కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో జిల్లాలో ఫెనాల్టీ ల భారం మోయలేక మైనింగ్ దందాలనే వదులు కున్నవారికి సర్కార్ భారీగా ఊరట కలిగించింది.మైనింగ్ అనుమతు లను ఉల్లఘించి వారి మీద అధికారులు యదేచ్చగా జరిమానాలు విధించారు.

దీనితో చాల మంది ఆర్థికంగా చితికి పోయారు. కొందరు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. ఫెనాల్టీ ల రూపేణా కోట్ల రూపాయలు సర్కార్ కు కట్టలేక అనేక మంది ఈ మైనింగ్ దందా ల నుంచే తప్పుకున్నారు .. ఇసుక, గ్రానైట్, క్రషర్లతో మొరం తవ్వకాల కోసం రెవెన్యూ మైనింగ్ శాఖలు నిర్దేశిత నియమావళి అనుమతులు ఇస్తాయి.

కానీ అనుమతులు పొందుతున్న గుత్తేదార్లు యదేచ్చగా తవ్వకాలు సాగిస్తూ నియమావళి తుంగలో తొక్కేస్తారు. మైనింగ్ అధికారులు క్షేత్ర పరిశీలనకు వెళ్లి అక్రమాలను గుర్తించి జరిమానా లు వేయడం షరా మాములే ! కానీ ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ మీద పది రేట్లు 20 రేట్లు కూడా జరిమానాలు విధించారు.

నిజామాబాద్ నగరంలో నంది గుట్ట సమీపంలో స్టోన్ మైనింగ్ లో గుత్తేదారు అనుమతుల కన్న ఎక్కువ మైనింగ్ చేసారని దాదాపు 30 రేట్లు ఫెనాల్టీ వేశారు దాదాపు పది కోట్ల రూపాయల జరిమానా కట్టలేక గుత్తేదారు తవ్వకాలే వదిలేసాడు. జిల్లాలో దాదాపు 14 మంది ఇలాగే జరిమానాలు కట్టాల్సిన వారున్నారు.

వారందరికీ ఓటీఎస్ కట్టేలా అవకాశం ఇచ్చింది.సర్కార్ .ముందుగా మొత్తం పెనాల్టీలో 20% చెల్లించాలని, తర్వాత 4 వారాల్లో మిగతా మొత్తం చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు.  20% పెనాల్టీ చెల్లించిన వెంటనే సదరు క్వారీ లేదా ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో నుంచి తీసేస్తామని తెలిపారు.

ఏడాది మొత్తం పెనాల్టీలు చెల్లించుకునేలా ఓటీఎస్  ఆప్షన్ ఉంది. దాదాపు 14 కంపెనీలకు పెనాల్టీలు వేసినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఐదుసార్లు పెనాల్టీ వేయాల్సి ఉంటే.. దానికి వన్ ప్లస్ వన్ (సాధారణ సీనరేజి ఫీజు+ వన్ టైంసాధారణ సీనరేజి ఫీజు) వేసేలా మార్చారు. అంటే లక్ష రూపాయలకు సాధారణ ఫీజు ఉంటే..

దానికి ఐదుసార్లు పెనాల్టీ వేస్తే  రూ.ఆరు లక్షలు చెల్లించాలి.  ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రెండు లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. అదే సమయంలో ఎక్కడైతే 10 టైమ్స్ పెనాల్టీ ఉంటుందో..

అక్కడ టూ టైమ్స్ కడితే సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంటే రూ.11 లక్షలు కట్టాల్సిన చోట రూ.3 లక్షలు కడితే సరిపోతుంది.సో ఇంత కాలం ఫెనాల్టీ లు కట్టలేక దందా ను వదిలేసిన వారికి ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చినట్లు అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments