ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించనున్నారు. పాఠశాలలు విధిగా ఒంటిపూట తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఇంటి పుట బడులు ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగించాలని కోరారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు కొనసాగించాలి. భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు అందించాలి.
అలాగే పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
