HomeTelanganaNizamabadట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు వాటర్ బాటిల్స్ ప్రధానం చేసిన పోలీస్ కమీషనర్..

ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు వాటర్ బాటిల్స్ ప్రధానం చేసిన పోలీస్ కమీషనర్..

ప్రతీదినం మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూన్న ట్రాఫిక్ సిబ్బందికి కంటికి చలువ దనమును ఇచ్చే కంటి అద్దాలను కూలీంగ్ స్టోరేజీ వాటర్ బాటిల్స్ ను రవీంద్ర ఫార్మసి మెడికల్ ఏజన్సీ వారి సౌజన్యంతో పోలీస్ క్యాంపు కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, సిబ్బందికి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ అతినీలోహిత కిరణాల వలన జబ్బు లువచ్చి అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంగా ఇట్టి కంటి అద్దాలను సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పక దరించి చక్కగ సద్వీనియోగం పరుచుకోగలరని తెలిపారు.

వీటి వలన దుమ్ము, దుళ్లి కంటికి ఎలాంటి ప్రమాదం కలుగదని, మరియు సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీటి బాటిల్స్ ఉపయో గించుకోవాలని పేర్కొన్నారు. సిబ్బంది ప్రతీఒక్కరు ప్రజలతో మర్యాదతో వ్యవహరించాలని, సిబ్బందికి ఇంకా ఎలాంటి అవసరాలు అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.

ఈ కార్యాక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి నారాయణ , సీఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసి అధ్యక్షులు మధు సుధన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ట్రేజరర్ సాయిలు మరియు ట్రాఫిక్ ఎస్ఐ లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments