తెలుగు సినిమా పరిశ్రమ ను బెట్టింగ్ యాప్ కేసులు కుదిపేస్తున్నాయి.బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో ని మియాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది
ఈ కేసులో అనేక మంది అగ్ర హీరో లు హీరోయిన్ లు ప్రముఖ యాంకర్ లున్నారు. అగ్ర హీరోలు హీరోయిన్ ల మెడ కు ఈ కేసు ల ఉచ్చు బిగించే దిశగా మియా పూర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
వీరి మీద గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో పలు సెక్షన్ లను చేర్చారు. తొలుత నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులకు స్పందించకపోతే తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలనేది పోలీసులు ఆలోచనగా ఉంది. ఎవరెవరు ఏ బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేసింది అందులో పేర్కొన్నారు. హీరో రాణా దగ్గుపాటి,ప్రకాష్ రాజ్, లు జంగిల్ రమ్మీ ని విజయ్ దేవరకొండ,ఏ 23 యాప్ లు ప్రమోట్ చేసి నట్లుగా గుర్తించారు.
హీరోయిన్లు మంచు లక్ష్మి, యెలా డాట్ కామ్ నిధి అగర్వాల్, జీత్ విన్ డాట్ కామ్ ప్రణీత ఫైర్ ప్లే అలాగే ప్రముఖ యాంకర్ శ్రీముఖి వి వి బి బోక్ డాట్ కామ్ లకు ప్రమోట్ చేసి నట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు పేర్కొంటున్నారు
అనన్య నాగేల్ల,సిరి హనుమంతు,శ్రీముఖి,వంశీ సౌందర్య రాజన్ శ్యామల లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు పిలువనున్నారు.
అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ను బెట్టింగ్ యాప్ ల మీద మరో కేసు నమోదు అయింది ఇందులో యాంకర్ విష్ణుప్రియ మీద కేసు నమోదు చేశారు ఈ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. యాంకర్ విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఆమె ఫోన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనన్న వాదన ఉంది.
