HomeCRIMEటార్గెట్ జీవన్ రెడ్డి .....నాలుగేళ్ళ నాటి భూవివాదం తెరమీదికి .....బాధితుడి పిర్యాదు మేరకు కేసు ......ముందస్తు...

టార్గెట్ జీవన్ రెడ్డి …..నాలుగేళ్ళ నాటి భూవివాదం తెరమీదికి …..బాధితుడి పిర్యాదు మేరకు కేసు ……ముందస్తు బెయిల్ హైకోర్టు ససేమిరా …..వరుస కేసులతో గులాబీ నేత ఉక్కిరి బిక్కిరి

కేసీఆర్ కేటీఆర్ లకు అంతరంగికుడిగా ముద్ర మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బిఆర్ యస్ ప్రభుత్వం లో ఉన్న పదేళ్ల పార్టీలో ప్రభుత్వం తిరుగు లేని ఆధిపత్యం చెలాయించిన జీవన్ రెడ్డి పాత కేసులు వెంటాడుతున్నాయి.

ప్రత్యర్థుల మీద విరుచుకు పడే జీవన్ రెడ్డి ఇప్పుడు పోలీసు కేసులతో ఆత్మ రక్షణలో పడ్డారు. న్యాయ పరమైన రక్షణ పొందడానికి పరుగులు తీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పలుకరించినా సరే జీవన్ రెడ్డి తగ్గేదెలా అన్నట్లు వ్యవహరించారు.

మునుపటి దూకుడు తగ్గయించుకోలేదు. సీఎం రేవంత్ మొదలు జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ,మహేష్ గౌడ్ లమీద తీవ్ర స్థాయిలో విరుచుక పడుతూ వచ్చారు. జిల్లాలో కొందరు బిఆర్ యస్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాలకే మొహం చాటేశారు.

ఎమ్మెల్యే లుగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ నేతలతో అంటకాగిఇప్పుడు మాజీలుగా మారక అదే తెరవెనుక దోస్తానా సాగిస్తున్నారు. మొదట్లో జీవన్ రెడ్డి సైతం సైలెంటుగా గా ఉన్నారు.

అయినా ఆయన కు చెందిన జీవన్ మాల్ ను లక్ష్యంగా చేసుకొని ఆర్టీసీ, విద్యుత్, యస్ ఎఫ్ యస్ లాంటి ప్రభుత్వ సంస్థలు తమ బకాయి లకోసం జీవన్ రెడ్డి ని వెంటాడారు. ఆయన ఎమ్మెల్యే గా వుండగా ఆ మాల్ వైపు కన్నెత్తి చూడని అధికారులు ఏకంగా మాల్ నే సీజ్ చేసారు. ఆయన హైకోర్టు ను ఆశ్రయించి ఊరట పొందారు.

కానీ అధికారుల ఓవర్ యాక్షన్ ఫై అప్పుడే మాజీ సుదర్శన్ రెడ్డి ని దృష్టి కి కూడా తీసుకెళ్లారు. కానీ జోక్యం చేసుకోవడానికి ఆయన ససేమిరా అన్నారు.ఆర్టిసి యండి సజ్జనార్ మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. సుదర్శన్ రెడ్డి కూడా విమర్శలు చేశారు.

అప్పటి నుండే జీవన్ రెడ్డి రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతలను దుమ్ము దులిపేసాడు. అదే ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసేలా పురి గొల్పింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడేళ్ళ నాటి రంగారెడ్డి జిల్లా ఈర్ల పల్లి లో 20 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి వివాదం తెరమీదికి తెచ్చారు.

దామోదర్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు మోకిల్లా, చేవెళ్ల పోలీస్ స్టేషన్ లలో నమోదు చేశారు. తన భూమి ని ఆక్రమించి ఫంక్షన్ హల్ ను కూల్చేశాడనేది పిర్యాదు దారుని అభియోగం.

కానీ ఈ వ్యవహారం జరిగింది బిఆర్ యస్ అధికారంలో ఉండగానే జరిగింది. కేసులు నమోదు కాగానే జీవన్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. తనతో పాటు భార్య రజిత, తల్లి రాజుబాయి ,లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ జీవన్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు.

అందుకే కొద్దీ రోజులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు కానీ జీవన్ రెడ్డి పిటిషన్ విచారించిన ధర్మాసనం భార్య తల్లీ కి రిలీఫ్ ఇచ్చింది కానీ జీవన్ రెడ్డి కి ముందస్తు బెయిల్ ను నిరాకరించింది.

దీనితో ఆయన ను పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది. కేసు ను న్యాయ పరంగా ఎదుర్కోవడానికే ఆయన సిద్ధం అవుతున్నారు. అవసరం అయితే సుప్రీం కోర్టు ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments