ఇందూరు నగరం: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ…ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డీఎన్ఏ(DNA)లోనే లేదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. ‘రాజీవ్ యువ వికాస్’ పథకం(Rajiv Yuva Vikas scheme) పెద్ద మోసమని, గారడీ అంకెలతో మళ్లీ మోసం చేసిందన్నారు.
రూ. 3లక్షల60 వేల కోట్ల బడ్జెట్లో రూ.60వేల కోట్లు కమిషన్ల రూపంలో మాయమవుతున్నాయని ఆరోపించారు.ఎన్నికలకు ముందు డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను చెత్తబుట్టలో పడేసింది.
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులను మహిళలను – విద్యార్థులను -నిరుద్యోగులను – యావత్ తెలంగాణ జనులను మోసం చేసింది అన్నారు.గృహజ్యోతి వెలుగులు లేవు,రైతు భరోసా – పైసల్ లేవు,ఇందిరమ్మ ఇండ్లు – ఐదులక్షలు రాలే – ఇంటి జాగా జాడలేదు అని అన్నారు. చేయుత – పింఛన్ పెరిగింది లేదు, యువ వికాసం – నయా మోసం అని తెలిపారు.
మహాలక్ష్మీ – పథకం ప్రస్తావనే లేదు, పైసల్ ఎకౌంట్ల పడలేదు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా .. మోసాలు.గత ప్రభుత్వం గారడీ మాటలతో మోసం చేస్తే వీళ్ళు గారడీ అంకెలతో మోసం చేస్తున్నారు అని తెలిపారు.
రైతులు ఎదురుచూస్తున్నారు..17 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, బడ్జెట్(Budget)లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేదన్నారు.
10లక్షల మంది పింఛన్ల(Pensions) కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ (Education System) కుంటుపడిందని, ఆరోగ్యశాఖకు 8 శాతానికి బదులు 4 శాతం కేటాయించడంతో పేదలు వైద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.బీసీల సంఖ్యను తగ్గించారు..
52 శాతం ఉన్న బీసీ(BC)ల సంఖ్యను కులగనణ ద్వారా తగ్గించారని ధన్పాల్ విమర్శించారు. రూ. 7 లక్షల కోట్లు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అప్పులు చేసిన విషయం స్వయానా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 నెలల కాలంలో రూ. లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు.మహిళా స్వశక్తికరణ మరియు మహాలక్ష్మి పథకం నిధులు ఎక్కడ? మహిళలని కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం ఏమి చేసింది? మహాలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రస్తావన లేదు, తాజా బడ్జెట్లో కూడా ఈ పథకం పక్కకు పెట్టారు అని అన్నారు.అంబేద్కర్ అభయహస్త పథకం నిధులు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులతో పాటు గిరిజనులకు సైతం రూ.12 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తామని ప్రకటించిందని, తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో దాని ప్రస్తావనే లేదని తెలిపారు.ప్రభుత్వం పింఛన్ పెంపుకు నిధులు ఎక్కడ అని అన్నారు. చేయూత పథకం కింద కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలకు పెన్షన్ పెంచుతామన్నారు.
కాంగ్రెస్ పెంచే వాగ్దానాల ప్రకారం 27 వేల కోట్లు అవసరం కానీ 14,861 కోట్లు మాత్రమే కేటాయించింది అన్నారు, కొత్తగా 10 లక్షల పింఛన్దారులకు పెన్షన్ ఎలా అందిస్తారో చెప్పాలని అని తెలిపారు.ఫీజు రీయింబర్సమెంట్ నిధులు ఎక్కడ?
ఫీజు రీయింబర్సమెంట్ పధకాన్ని ప్రవేశపెట్టింది మేమె అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ – బకాయిల తీర్చేందుకు నిధులు ఎక్కడ?
కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు, హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో ఎలా ఇబ్బందులు పెట్టాయో చూశాం అని తెలిపారు.విద్యాభివృద్ధికి నిధులు ఎక్కడ?
కాంగ్రెస్ 15% బడ్జెట్ విద్యకు కేటాయిస్తామని చెప్పింది, కానీ కేవలం 6.7% మాత్రమే కేటాయించారు.
₹45,000 కోట్లు ప్రామిస్ చేసినప్పటికీ ₹6.7% అంటే ₹20,000 కోట్లు మాత్రమే కేటాయించారు.
విద్యాశాఖకు 15 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేరు కాంగ్రెస్ హామీ ప్రకారం 15 శాతం నిధులు లేవుఅని అన్నారు !!
₹5 లక్షల విద్యాభరోసా కార్డు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాళం రాజు, మండల అధ్యక్షులు తారక్ వేణు, గడ్డం రాజు, ఆనందరావు, నాగరాజు, తాజా మాజీ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, బట్టు రాఘవేందర్, కిషోర్ ఇప్పకాయల, శ్రీధర్ పంచరెడ్డి, ఇల్లెందుల ప్రభాకర్, సాయి వర్ధన్, ముత్యాలు, బీజేపీ నాయకులు పుట్ట వీరేందర్, చిన్న కారి నరేష్, మఠం పవన్, భాస్కర్, పవన్ ముండద, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
