HomeCRIMEపండగ పూట విషాదం ....చెరువులో పడి తల్లీ తో ముగ్గురు పిల్లలు మృతి .....ఆత్మ హత్య...

పండగ పూట విషాదం ….చెరువులో పడి తల్లీ తో ముగ్గురు పిల్లలు మృతి …..ఆత్మ హత్య గా అనుమానం ….

తెలుగునాట తోలి పండగ ఉగాది నాడు కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో ఆదివారం జరిగింది.

గ్రామానికి చెందిన మౌనిక. (29)తన ముగ్గురి పిల్లలు మైథిలి(10), అక్షర( 9) వినయ్ (7)లను వెంటబెట్టుకొని బట్టలు ఉతకడానికి వెళ్తున్నంటూ శనివారం ఉదయం బయలు దేరింది. సాయంత్రం భర్త వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేక పోవడంతో ఇరుగు పొరుగు ను వాకబు చేశారు.

వారి ఆచూకీ లభ్యం కాక పోవడంతో స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసారు. దీనితో వెంటనే స్పందించిన పోలీసులు నలుగురి కోసం రాత్రంతా గాలించారు.

అయితే గ్రామ శివారు లోని పెద్ద చెరువు వద్ద మహిళా మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసులు భర్త తో కలిసి చెరువు వద్దకు వెళ్లి గాలించారు మౌనిక మృతదేహం ను గుర్తించారు.

అప్పటికే అర్ద రాత్రి కావడంతో వెనక్కి వచ్చిన పోలీసులు ఆదివారం ఉదయమే చెరువులో గజ ఈతగాళ్లను రంగంలోకి దించి చెరువులో వెతికించారు రెండు గంటల ప్రయత్నం తర్వాత మిగతా కూతుళ్లు మైథిలి, అక్షర కొడుకు వినయ్ ల మృతదేహాలు లభ్యం అయ్యాయి.

పండగ వేళా గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లోని నలుగురు మృత్యువాత పడడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే ఈ ఘటన ప్రమాదశావత్తు జరిగిందా ? లేదంటే కుటుంబ కలహాలతో ఆత్మ హత్యకు పాల్పడ్డారా ? అనేది తదుపరి పోలీసు విచారణ లో తేలాల్సి ఉంది. మృతదేహాలను పోస్టు మార్దరం కు తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments