నగరంలో వసూళ్ల ముఠాలు చెలరేగుతున్నాయి.వడ్డి వ్యాపారాలు తమ బకాయి లను రాబట్టుకోవడానికి రౌడీ మూకలను రంగంలోకి దించుతున్నాయి.
ఇప్పడు కొత్తగా మహిళా గ్యాంగ్ లు రంగంలోకి దిగుతున్నాయి. మహిళా సంఘాల ముసుగులో కొందరు సెటిల్ మెంట్ దందాలకు ఎగ బడుతున్నారు.
మహిళల హక్కుల రక్షణ కోసం పనిచేయాల్సిన ఈ సంఘాలు మహిళలనే టార్గెట్ చేస్తున్నాయ్. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. మరికొందరు ఇండ్ల మీదికి వెళ్లి మహిళల మీద దాడులకు తెగబడుతున్నారు.
బాధితులు పిర్యాదు చేస్తున్న కఠిన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు వెనుకాడుతున్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కు దాటే అన్న చందంగా బాధితుల మీద కఠిన మైన చట్టాలను ప్రయోగిస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో ని ఆదర్శ్ నగర్ కి చెందిన మహిళా నేత మరో నలుగురి తో ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని భూ వివాదాలను సెటిల్ చేస్తున్నారు.
సరే చట్ట పరిధి లో జోక్యం చేసుకుంటే పర్వాలేదు కానీ ఇంటి మీదికి మూకుమ్మడిగా వెళ్లి తోటి మహిళా అని కూడా చూడకుండా బీభత్సం చేస్తున్నారు. అడ్డొచ్చిన స్థానికుల మీద ఈ గ్యాంగ్ చేయి చేసుకుంది.
నాగారంలో గత వారం రోజుల క్రితం స్థానిక మహిళా నేత ఇంటికి వెళ్లిన ఈ గ్యాంగ్ తమకు నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉన్నావని వెంటనే ఇవ్వాలంటూ దబాయించారు. అసలు వచ్చిన ఆ మహిళలు ఎవరో ఆమె అర్థం కాలేదు.
మీరు ఎవరో కూడా నాకు తెలియదు కనీసం ఎప్పుడు చూడలేదు నేను అప్పు ఎలా తీసుకున్నా అంటూ సదురు మహిళా నేత సైతం గద్దించారు. అప్పు తీసుకున్నట్లు కనీసం చిన్న ఆధారమైన చూపాలంటూ అడిగారు .
దీనితో ఖంగు తిన్న గ్యాంగ్ ఎలాంటి ఆధారలులేవు నోటి మాట మీదే ఇచ్చాను అంటూ ఆమె మీద మూకుమ్మడిగా దాడి కి దిగారు. చుట్టుపక్కల వారు వచ్చి వారించినా వారిమీద కూడా విరుచుకు పడ్డారు. దీనితో సదరు బాధిత మహిళా నేత నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశారు.
ఎస్సై సైతం నివ్వెర పోయారు.డబ్బులు ఇచ్చేది వుంటే ఇంటిమీదికి వెళ్ళి ఎలా దాడి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు ఇచ్చినట్టు గా కాగితాలు ఉన్నాయా అంటే లేవని చెప్పారు.
ఎక్కడో ఆదర్శ్ నగర్ లో ఉండే మీకు ముక్కు మొహం కూడా తెలియని నాగారం మహిళకు నాలుగు లక్షలుఏలా ఇచ్చారని ప్రశ్నించారు. అయినా డబ్బుల వసూలు కోసం వెళ్లి మహిళా మీద దాడి చేస్తారా అంటూ ఎస్సై క్లాస్ ఇచ్చారు.
బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలనీ ఎస్సై ఆదేశించారు దీనితో షాక్ తిన్న మహిళా గ్యాంగ్ నేత కఠిన చట్టం ను ప్రయోగించారు.తనను ఇంట్లో నెట్టేశారని ఆమె భర్త చెయ్ చేసుకొని తిట్టారంటూ ఓ పిర్యాదు ఇచ్చింది.
ఇంటిమీదికి వెళ్ళింది మీరు ఉల్టా మీరే కేసు ఎలా పెడతారంటూ బాధితురాలు మండిపడ్డారు. పూసల గల్లీ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా నేత స్థానిక మహిళల నుంచి దాదాపు కోటి రూపాయల మేరకు వసూలు చేసింది.
తమ డబ్బుల ఇవ్వాలని అడిగిన మహిళా మీద పోలీసులకు పిర్యాదు చేసింది. నలుగురు మహిళతో వెళ్లి హంగామా చేసింది. ఈమె బాధితుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత కూడా ఉన్నారు.
సదరు బీజేపీ నేత బాధితులు నేరుగా ఎమ్మెల్యే దన్ పాల్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీసం ఫోన్ చేసి డబ్బులు అడిగినా సరే స్టేషన్ నుంచి తమకు పిలుపు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
నగరంలో ఇదే తరహాలో మరో మహిళా గ్యాంగ్ వినాయక్ నగర్ లో ఉంది. ఆపద లో ఉన్న మహిళా లకు అండ ఉండాల్సింది పోయి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు.
ఏ మాత్రం ఎదురు తిరిగినా కేసుల పేరు తో వేధింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి గ్యాంగ్ ల విషయంలో కఠినంగా ఉండలని బాధిత మహిళలు కోరుతున్నారు
