నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రెండేళ్ల బాలుడు మిస్సింగ్ అయ్యాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన లత తన రెండేళ్ల బాలుడినీ తీసుకొని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
ఈ మేరకు ఒకటవ అంతస్థులోని గైనకాలజి వార్డులో ఓపీ చూయించుకునే క్రమంలో తప్పిపోయినట్లు తెలిపింది. ఆ తర్వాత చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.దీంతో స్థానిక ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు.
