HomeDevotionalప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి నిర్వహించాలి.ర్యాలీ నిర్వాహకులతో సమావేశమైన పోలీస్ కమీషనర్..

ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి నిర్వహించాలి.ర్యాలీ నిర్వాహకులతో సమావేశమైన పోలీస్ కమీషనర్..

అందరూ సమన్వయంతో పనిచేస్తూ, హనుమాన్‌ జయంతి ర్యాలీ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు.

12వ తేదీన నగరంలోని కంటేశ్వర్ నుంచి ఆర్ ఆర్ చౌరస్తా వరకు జరగనున్న ఈ హనుమాన్ జయంతి ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఇతర శాఖల అధికారులు,ర్యాలీ నిర్వహకులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సవం జరుపుకోవాలని కోరారు. ర్యాలీ ఆధ్యాత్మికంగా నిర్వహించుకోవాలని అదే సమయంలో ఇతరులకు, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.

ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ల ను నిషేధించటం జరిగింది అన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, ఆర్య సమాజ్, ఏబీవీపీ, హిందు వాహిని తదితరులు పాల్గొని తమ సమస్యలు అభిప్రాయాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సాయి కిరణ్ , అదనపు పోలీస్ కమీషనర్ ( స్పెషల్ బ్రాంచ్ ) శ్రీనివాస్ రావ్, ఇంచార్జి అదనపు DCP ( అడ్మిన్ ) మస్తాన్ అలీ, ACP, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ రాజా వెంకట్ రెడ్డి ఇన్స్పెక్టర్ లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments