ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలురు కుంటలో శవాలై తేలారు. ఈ ఘటన కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. మృతి చెందిన వారిని కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్ సాయికుమార్(16), భుక్యా సురేష్ (15) గా గుర్తించారు.మూడు రోజుల కింద అదృశ్యమైన వారు శవాలై తేలడంతో తండావాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీరు ఇద్దరు ముత్యంపేట గ్రామ కల్లు దుకాణంలో పనిచేస్తారని స్థానికులు తెలిపారు.
