సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు ప్రజా ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వల నుండి ఇందూర్ కార్పొరేషన్ కి అమృత్ -2 కింద జరుగుతున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 162 కోట్లు,వాటర్ సప్లై 217 కోట్ల మంజూరు అయినా పనులపై సమీక్షా నిర్వహించడం జరిగిందన్నారు.
నగరంలో 150 మాన్ హోల్స్ పునః నిర్మాణం చేసినట్లు అలాగే 45 కొత్తవి నిర్మాణం చేసినట్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేసినట్లు అలాగే వాటర్ సప్లై కొరకు రెండు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పనులు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే గారికి నివేదిక ఇవ్వడం జరిగింది.
వర్షాకాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరత గతిన పూర్తి చేయాలనీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.
వేసవి కాలంలో నగర వాసులు మంచినీటికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలని మంచినీటి ట్యాంక్ లు నాలా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతం చేసి వేసవిలోగ పూర్తి చేసి ప్రజా ఉపయోగంలో తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో EE తిరుపతి, DE నగేష్ రెడ్డి, మేఘ ఇంజినీర్ యువరాజ్, AE వినావాణి, సుకుమార్, సాయి చంద్, శివ కృష్ణ
