ఇందూర్ నగరం : మహాత్మా జ్యోతి రావ్ పూలె 199వ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినాయక నగర్ విగ్రహాల పార్క్ వద్ద నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్బంగా మహాత్మా పూలె విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు మహాత్మా జ్యోతి రావ్ పూలె సామజిక తత్త్వవేతగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని కొనియాడారు.
మన దేశ ప్రగతి యాత్రలో వెనుకబడటానికి, వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో మ్రాగ్గడానికి,మూఢచారాలు ప్రబలడానికి కారణం ప్రజల్లో జ్ఞానం లేకపోవడమే అని గుర్తించి సమాజంలో అందరిని విద్యావంతులను చేయాలనేవిషయంలో శ్రద్ద వహించకపోవడమేనన్న విషయాన్నీ గ్రహించి జ్యోతిరావు పులే తన జీవితం అంత బడుగు బలహీన వర్గాల ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేసారన్నారు.
సత్యశోదక్ సమాజ్ ద్వారా సమాజంలో అసమానతలను, మూఢ నమ్మకాలను రూపుమాపడానికి పోరాటం చేసారన్నారు.జ్ఞానం లేకుంటే గౌరవం లభించదని, శిక్షణ లేకుంటే సమాజంలో సంస్కరణ సాధ్యం కాదని, స్త్రీలను విద్య అందించాలన్న సంకల్పంతో మొదట తన భార్య సావిత్రిభాయ్ విద్య నేర్పిచి పూణే నగరంలో మొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారని తెలియజేసారు.
ఆంగ్లప్రభుత్వం పేదప్రజల కొరకు ఉచితంగా చదువు చెప్పించే ఏర్పాటు చేసి, వారి అజ్ఞానాన్ని, పేదరికాన్ని తొలగించి, ప్రజలను సుఖంగా, సంతృప్తిగా జీవించేటట్లు చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిన మహనీయులు పులే అని అన్నారు.పులే దంపతులు ఇరువురు సమాజంలో అసమానతలు, కుల వ్యవస్థ నిర్ములనకు పోరాటం చేస్తూ బాల్య వివాహలకు వ్యతిరేకంగా, వితంతు గర్భిణీలకు అండగా, అనాధ పిల్లలను అక్కున చేర్చుకున్న మహనీయులు పులే దంపతులు అన్నారు.
సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న, సంఘ బహిష్కరణలు చేసిన చివరికి తండ్రి కూడా ఇంటినుండి వెళ్లగొట్టిన వనవాసనికి రాముని వెంట సీతలా పులే వెంట సావిత్రి భాయ్ భర్త లక్షసాధనలో తోడుండి ఈ దేశానికి మొదటి పంతులమ్మ అయ్యి వారి జీవితాన్ని పూర్తిగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి,సమానత్వం కోసం పాటుపడటం జరిగిందన్నారు.
నేటి సమాజం,యువత వారి ఆశయ సాధనలో నడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
