ఆగి ఉన్న కారును ఢీ మరో కారు బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని శనివారం రాత్రి బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..
బైపాస్ రోడ్డులోనీ లహరి హోటల్ ముందు ఉన్న ఓ వెంచర్ పక్కన ఆగి ఉన్న కారును నిజామాబాద్ నుంచి మాధవనగర్ వైపు వెళ్తున్నా మరో కారు అదుపు తప్పి వెనక నుంచి ఢీ కొట్టింది.
దీంతో కారు బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇద్దరు మహిళల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
