మైనర్ కూతురిని వేధిస్తున్న సవతి తల్లిపై కేసు నమోదు చేసి చేసినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
నాలుగు సంవత్సరాల క్రితం షేక్ హుస్సేన్ మొదటి భార్య అహ్మాదీ బేగం అనారోగ్యం కారణంగా మృతి చెందారు.వీరికి నేహా కౌసర్ అనే 13 ఏళ్ల బాలిక ఉన్నట్లు తెలిపారు.
ఈ మేరకు హుస్సేన్ మొదటి భార్య అహ్మాదీ బేగం మృతి చేదనగా రిజ్విన బేగం అనే మరో మహిళలను రెండవ వివాహం చేసుకోగా వారికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.
ఈ మేరకు హుస్సేన్ రెండవ వివాహం చేసుకున్న నాటి నుంచి మొదటి భార్య కూతురైన నేహా కౌసర్ ను చదువు మానిపించి ఇంట్లో పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు.
ఈ మేరకు ఈ నెల 8 తేదీన బాలికను తండ్రి హుస్సేన్,సవతి తల్లి రిజ్విన బేగంలు చిత్ర హింసలు చేసి భైంసా లోని అత్తమ్మ ఇంటి ముందు పడేసి వెళ్లారని తెలిపారు.
దీంతో వారు బాలికను స్థానిక ఆసుపత్రిలో చేర్చి తండ్రి హుస్సేన్ సవతి తల్లి రిజ్విన బేగంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
