నిజామాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల సాయి రెడ్డి సూర్యాపేట న్యాయవాది కిషోర్ పైన జరిగిన దాడిని నిజామాబాద్ న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన న్యాయవాదులు సూర్యాపేట్‌లో న్యాయవాది కిషోర్ పైన జరిగిందా దాడిని తీవ్రంగా ఖండించి తమ విధులకు దూరంగా ఉండటం జరిగింది.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో న్యాయవాదుల మీద దాడులు సర్వ సాధారణం అయిపోయిందని న్యాయం కోసం వాదించే న్యాయవాదులకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయిందని ఇక ఇలాంటి దాడులను సహించబోమని హెచ్చరించారు.
అదే సమయంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అన్నట్లు కలుపుకొని న్యాయవాదుల వెల్ఫేర్,మరియు రక్షణ చట్టం అమలు కోసం సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్ధం అయ్యేలా పెద్ద సంఖ్యలో న్యాయవాదులతో కదలి వెళ్ళి వినతి పత్రాన్ని అందిస్తాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు తుల గంగాధర్,ఎర్రం విఘ్నేష్,గణపతి,జగదీశ్వర్ రావు,తదితరులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
