రాబోయే రోజుల్లో జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిజామాబాద్ జిల్లా కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తా మని తెలిపారు.
సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,, జూపల్లి కృష్ణారావు తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ లో సాగయ్యేప్రతి పంటకు కనీస మద్దతు ధర అమలు చేస్తామన్నారు షుగర్ ఫ్యాక్టరీలు పునరు ద్దరి స్తామని మంత్రి తెలిపారు. పసుపు బోర్డు లోరైతులకు ఉపయుక్తంగా కార్యక్ర మాలు చేపట్టాలన్నారు.
ఆర్థికపరంగా ప్రభుత్వానికికష్టాలున్నా రూ 33 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. డ్రిప్ వ్యవసాయం చేసే రైతు లందరికీ ఏదడిగితే అది నిజామాబాదు జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి అం దజేస్తామన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రం లో రైతు సంక్షేమ పథకాలకు సహా యం చేయాలని అడి గాం..అందుకు సానుకూల స్పందన వచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు.వడ గండ్ల వానలు తదితర కార ణాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరి హారం కూడా త్వరలోనే అందజేస్తాం.
రైతులు శాస్త్రవేత్తల సూచనలక నుగుణంగా సాగు చేస్తూ రైతు మహోత్సవవాన్ని సద్వినియోగం చేసుకోం డని మంత్రి తుమ్మల రైతులని కోరారు. యేటా పంటలను తక్కువ ధరకు కొని అమ్ము తూ నష్టపోతున్నా రైతు లు పండించే జొన్న, మక్క తదితర ఏ పంటనైనా కొంటామని తెలిపారు.
ఆయిల్ ఫాం పంట వేయండి..ప్రభుత్వ సహ కారం ఉంటుంది..24 గంటల్లో కొని 24 గంటల్లో డబ్బులు మీ ఖాతాల్లో వేయిస్తామని మంత్రి తెలిపారు. ఆదాయం ఉన్న పంటలను పండించాలన్నారు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎంఎస్పీ, బోనస్ బకాయి లను రెండు రోజుల్లో రైతుల ఖాతా ల్లో వేస్తమన్నారు .
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను కోరారు రైతుల్లో చైతన్యం అవగాహన పెంచేందుకు రైతు మహో త్సవం ఏర్పాటని అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజె క్టులకు గత ప్రభుత్వం 1.81 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి నీరివ్వ లేదు. ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తా మన్నారు.
నెలాఖరులోపు టెండర్లు పిలిచి నిజాం సాగ ర్ పూడిక తీయించి ఆయ కట్టుకు నీరందిస్తామ న్నారు. గుత్ప ఎత్తిపోతల ను మరింత విస్తరించడానికి అవసరమైన నిధులిచ్చి సకాలం లో పూర్తీ చేస్తామన్నారు . తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరం దించేలా చర్యలు చేపడుతున్నామని అన్నా రు.సన్నరకం బియ్యం రేషన్ షాపుల ద్వారా ఎక్కడా లేని విధంగా రూ 3 కోట్ల పది లక్షల మందికి ఇస్తున్నా మని తెలిపారు.
గత బిఆ ర్ఎస్ లక్ష కోట్లతో మొదలు పెట్టిన కాళేశ్వరం నిరుప యోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండించారు.దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ లో 281 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం పండించిన ఘన త రైతులదన్నారు . రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించి రైతులతో మాట్లాడారు.
