HomeTelanganaNizamabadఅట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం .. ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

అట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం .. ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం.. భాగస్వాములైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు..ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు .. ఐదు జిల్లాల నుండి హాజరైన రైతులు

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 23 వరకు కొనసాగనున్న రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది.

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవాన్ని లాంచనంగా ప్రారంభించారు.

హైదరాబాద్ నుంచి మంత్రితో కలిసి హెలికాప్టర్ లో విచ్చేసిన సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.

వీరితో పాటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ అధికారులు భవాని శ్రీ, గోపి, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు భాగస్వాములు అయ్యారు.

రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

సేంద్రీయ విధానంలో పంటల సాగు, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే వంగడాలు తదితర వాటి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి ఐదు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్టాల్స్ సందర్శించి, నూతన ఆవిష్కరణలు, ఆధునాతన వంగడాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments