పరువు పోయిందని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చందూరులో జరిగింది. గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి (46) అదే గ్రామానికి చెందిన ఓ పురుగు మందుల దుకాణంలో అప్పు చేశాడు.
అప్పు తీర్చకపోవడంతో దుకాణ యజమాని కోర్టును ఆశ్రయించాడు. దుకాణ యజమానికి అప్పు చెల్లించాలని పొలం ఎవరికి అమ్మకూడదని కోర్టు ఆదేశాలతో చాటింపు వేయించాడు.
పరువు పోయిందని మనస్తాపం చెందిన రైతు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
