నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పై వినూత్న నిర్ణయం తీసుకున్నారు.బుదవారం నగరంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆద్వర్యంలో ఎస్ఐ సుమన్ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించకుండా నూతన హెల్మెట్ కొనిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించని వారిలో మార్పు కోసం హెల్మెట్ ఆవశ్యకత మీద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించడం మా అభిమతం కాదు మీ రక్షనే మా ధ్యేయమని తెలిపారు.
