ఈ రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి అద్వర్యలో నిన్న కాశ్మీర్ పెహెల్గోవ్ లో సామాన్య మానవులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ రోజు కోర్టు కాంప్లెక్స్ లోని బార్ రూమ్ లో సమావేశం అయిన న్యాయవాదులు ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి 2 నిమిషాల మౌనం పాటించి అనంతరం జిల్లా కోర్టు గేటుముందర గుమిగూడి ప్లకార్డులు ప్రదర్శించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినదించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ సామాన్యులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఎటువంటి దాడులను భారత్ వెనక్కి తగ్గదు అని ఉగ్రవాదాన్ని రూపు మాపడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు భారత ప్రజల పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రకోరాలను కూకటి వేళ్ళతో ప్రకటించాలని కోరారు.
