HomeCRIMEకనిపించని కల్లాలు.. రోడ్లపైనే వడ్లు..ధాన్యం ఆరబోసేందుకు స్థలం కరువు..బెంబేలెత్తుతున్న వాహనదారులుప్రమాదాలకు కారణమవుతున్న ధాన్యం కుప్పలుచోద్యం చూస్తున్న...

కనిపించని కల్లాలు.. రోడ్లపైనే వడ్లు..ధాన్యం ఆరబోసేందుకు స్థలం కరువు..బెంబేలెత్తుతున్న వాహనదారులుప్రమాదాలకు కారణమవుతున్న ధాన్యం కుప్పలుచోద్యం చూస్తున్న పాలకులు..

కనిపించని కల్లాలు.. రోడ్లపైనే వడ్లు..ధాన్యం ఆరబోసేందుకు స్థలం కరువు..బెంబేలెత్తుతున్న వాహనదారులుప్రమాదాలకు కారణమవుతున్న ధాన్యం కుప్పలుచోద్యం చూస్తున్న పాలకులు..రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు.

యాసంగి వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకుకారణం. రోడ్లు మొత్తం ధాన్యం రాశులతో నిండిపోతున్నాయి. సగం రోడ్లు ధాన్యం కుప్పలతో ఆక్రమిస్తుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి.

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దారులన్నీ ధాన్యం కల్లాలుగా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళ ధాన్యం కుప్పలు కనిపించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ధాన్యం ఆరబెట్టేందుకు పొలాల వద్ద కల్లాలు లేకనే రోడ్లపై ధాన్యం పోయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. యాసంగిలో సాగు చేసిన దిగుబడులు ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నాయి. నగర శివారులోని బోర్గాం(కే) నుంచి పలు గ్రామాల్లో వరి ధాన్యంలను గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్లపై పోస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరిపడా కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లపై ఆరబెట్టుకుంటున్నారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా చూసినా రోడ్ల వెంబడి ఒక వైపుకు ధాన్యం ఆరబోసి కనిపిస్తున్నాయి.అలగే ధాన్యం ఎండిన తర్వాత సకాలంలో కొనుగోలు కాకపోవడంతో వారాల కొద్ది టార్పాలిన్‌లు కప్పి ఉంచుతారు. ఇలా ఉంచడంతో రాత్రి వేళ సంబందిత గ్రామీణ ప్రాంతాల్లోనీ జనాలు రోడ్ల మీద ఉన్న కల్లాలు కనపడక చిన్నా పెద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న పాలకులు, వ్యవసాయ సొసైటీ సభ్యులు,చోద్యం చూస్తున్నారని వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు జాగ్రత్తలతోనే మేలు…రైతుల భాగస్వామ్యంతో పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సమన్వయం గా వ్యవహరిస్తే ధాన్యం ఆరబోత వల్ల రహదారులపై జరిగే ప్రమాదాలు కొంత వరకు నివారించే అవకాశాలున్నాయి.

వ్యవసాయ శాఖ గ్రామాల వారిగా ధాన్యం దిగుబడులపై అంచనా వేసి ఆరబోయడానికి ముందే ప్ర ణాళికలు రూపొందించాలి. రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి అనువుగా స్థలాలను మార్చాలి.

ఇక తప్పని సరి పరిస్థితుల్లో రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి.సంచులు, కుప్పలు వాహన చోదకులకు క నిపించేలా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

వ్యవసాయ శాఖ,రెవెన్యూ, పోలీస్ శాఖ, రైతులు సమన్వయంతో పలు జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా ప్రమాదాలు అరికట్టవచ్చని వాహన చోదకులు అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments