తరుగు పేరిట రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని, రైస్ మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ గ్రామ రైతులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని రాం ప్రతాప్ థియేటర్ సమీపంలో బోధన్ _ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ప్రస్తుతం రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే మరోవైపు రైస్ మిల్లర్లు కుమ్మక్కై వరి ధాన్యం తూకంలో అధిక తరుగును తీస్తూ, ఒక్కో లారీ లోడ్ లో 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు ధాన్యం తరుగు కింద తీసి వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు
