నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ లో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. గౌసియా మసీద్ ప్రాంతం లో ఉండే ఓ వ్యక్తి బుధవారం కుటుంబ సభ్యులతో తన ఇంటికి తాళం వేసి హైదారాబాద్ వెళ్ళాడు గురువారం వచ్చి చూడగా ఇంటి తాళం పగల గొట్టి ఉంది.
ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువా లో దాచిన అయిదు తులాల బంగారం మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లారు బాధితుల పిర్యాదు మేరకు ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు
