నిజామాబాద్ అర్బన్ నాందేవ్ వాడ లోని 35 వ డివిసన్ లో నిజామాబాద్ బిఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షులు కరిపే రాజు ఆధ్వర్యంలో జెండా దిమ్మెకు రంగులు వేసి రజతోత్సవ కార్యక్రమానికి ముస్తాబుకొఱకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ నెల 27 వ తేదీన వరంగల్ లోని ఎల్కతుర్తి లో జరగబోయే బహిరంగ సభను తెలంగాణ లోని ప్రజలందరూ లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ప్రస్తుతం తెలంగాణ లో ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా డబ్బుసంచితో దొరికిన రేవంత్ రెడ్డి అరవికాని హామీలిచ్చి ప్రజలను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్,ప్రమీల,బాబాన్న,నరేష్,రవి,శివ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
