Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadమేమంతా మోడీ వెంటే... నందిపేట ముస్లిం కమిటీ

మేమంతా మోడీ వెంటే… నందిపేట ముస్లిం కమిటీ

మొన్న జరిగిన పహల్గాం టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ శుక్రవారం నందిపేట ముస్లిం మైనార్టీ సభ్యులు పాకిస్తాన్ డౌన్, డౌన్,… హిందుస్థాన్ జిందాబాద్.., ఖబర్దార్ టెర్రరిస్టుల్లారా… హమ్ ఏక్ హై అంటూ నినాదాలు చేస్తూ…

బడి మజీద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహించి ఆ దాడిలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హైమద్ మాట్లాడుతూ…. మొన్న జరిగిన బహల్గాం దుర్ఘటన అత్యంత నీచమైనదని ప్రపంచంలో ఎవరు ఆ దాడిని సహించబోరని, భారతదేశంలో భిన్న మతాలు ఉన్న భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి ఒక్కరూ సోదరా భావంతో కలిసి ఉంటారని, ఆ నీచమైన పాకిస్తాన్ కుక్కలు మతాన్ని అడ్డుపెట్టుకొని గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, మేము ఇక్కడ అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని వారికి తెలియదన్నారు.

మాజీ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనలో 26 మందిని మతం ప్రాతిపదికన చంపడం నికృష్టమైన చర్య అని, దేశంలోన కులమతాలతో ఉన్న మేము దేశ భద్రతకు వచ్చేసరికి…

మాదంతా ఒకే కులం, ఒకే మతమని, దేశం కోసం చావడానికి అయినా ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటాడని, ఈ సత్యాన్ని దాయాదిదేశం తెలుసుకోవాలన్నారు. బడి మజీద్ అధ్యక్షులు జావేద్ మాట్లాడుతూ…. భారతదేశంలో కుల మతాలకతీతంగా సోదరా భావంతో ఒకరినొకరు కలిసుండడం, దినదినాభివృద్ధితో దేశం పురోగమిస్తుంటే….

ఉగ్ర కోరల్లో చిక్కుకున్న పాకిస్తాన్ కపట బుద్ధితో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకొని 26 మందిని పొట్టన పెట్టుకున్నారని, ప్రతి భారతీయుడు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాడని, ఎంతటి వారైనా శిక్ష తప్ప దని, దేశ భద్రత విషయంలో భారత ప్రధాని మోడీకి అండగా ఉంటామని హెచ్చరించారు.

పార్టీలకతీతంగా మైనార్టీ నాయకులు, మజీద్ ల ఇమాములు, ముస్లిం యువకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!