వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతంగా హత్య చేశారు. సైబారాబాద్ కమిషనరేట్ పరిధి లోని అల్వాల్ సూర్యనగర్ సమీపంలో ఓ ఇంట్లో కనకయ్య( 68 ) రాజవ్వ(65) లు గత కొద్దీ రోజులుగా నివాసం వుంటున్నారు.
ఖమ్మం జిల్లా ఇల్లేందు ప్రాంతానికి చెందిన వీరు బతుకు దెరువు కోసం హైదారాబాద్ వచ్చారు కూతరు కొడుకు లు తమ కుటుంబాలతో సమీపంలోనే నివాసం వుంటున్నారు.
కనకయ్య స్థానికంగా వడ్డీలకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోకి చొరబడ్డ ఆగంతకులు ఇద్దరినీ విచక్షణ రహితంగా కొట్టారు ఆ తరువాత హత్య చేసి వెళ్లిపోయారు.
వచ్చింది దొంగల ముఠా నా ? లేదంటే వడ్డి తాలూకు వివాదం వల్లే హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
