ఒలంపిక్ స్థలం అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య హెచ్చరించారు.జిల్లా కేంద్రం లోని 106 సర్వే నంబర్లు భూమి లో 700 గజాల స్థలాన్ని ఒలంపిక్ భవనం కోసం ఇచ్చారని . కేటాయించిన ఒలంపిక్ భవన స్థలానికి గతంలో మంత్రి సుదర్శన్ రెడ్డి గారు రూ 15 లక్షలు మంజూరు చేశారు.
ఆ డబ్బులతో ఒలంపిక్ భవన స్థలాన్ని బేస్మెంట్ మరియు పిల్లర్ల వరకు నిర్మించగా, కొందరు కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పిల్లర్ లను మరియు బెస్మిట్ నూ జెసిబి లతో కులగోట్టారు అప్పుడు వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వారిపై కేసు నమోదు అయింది.
మళ్లీ ఇప్పుడు ఆ స్థలాన్ని మరికొందరు కబ్జా చేసుకోవడానికి ఫేక్ డాక్యుమెంట్తో అమ్మాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని .ఆయన అనుమానం వ్యక్తం చేసారు ఒలంపిక్ భవన సంఘ స్థలమని దీన్ని ఎవరు కబ్జా చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని ఎవరి దగ్గరన్నా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే కలెక్టర్లు కలిసి వాటి వారికి సమర్పించాలని సూచించారు.
ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కబ్జా కు పాల్పడితే ఎట్టి పరిస్థిలో ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఏడు ఎకరాల 35 గుంటల్లో కలెక్టర్ గారి సహకారంతో దానికి చుట్టూ ఫినిషింగ్ చేయడం జరిగిందని దానికి గాను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారికి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఒలంపిక్ సంఘ భవనానికి కూడా కలెక్టర్ మరియు రాజకీయ నాయకుల సహాయ సహకారాలు ఉండాలని క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. క్రీడలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లాలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని మునుమందు మరింత మంది క్రీడాకారులు రాణిస్తారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమారెడ్డి, ఉపాధ్యక్షులు గాదరి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదరషులు వెంకటేశ్వర్లు,అబ్బన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
