HomeTelanganaNizamabadముగిసిన నీట్ పరీక్షా ......జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో 3298 మంది హాజరు .......ఆలస్యంగా వచ్చారని ముగ్గరికి...

ముగిసిన నీట్ పరీక్షా ……జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో 3298 మంది హాజరు …….ఆలస్యంగా వచ్చారని ముగ్గరికి అనుమతి ఇవ్వని అధికారులు

వైద్య కళాశాలల ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది నిజామాబాద్ జిల్లా బోధన్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలో  ఆలస్యంగా వచ్చిన  ముగ్గురు విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదు అధికారులు.

ఈ పరీక్షలో అధికారులు కఠిన నిబంధనలు విధించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలవగా.. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్ చేశారు. ఈ విషయాన్ని హాల్ టికెట్లలో ముందుగానే పేర్కొన్నప్పటికీ..

పలువురు అభ్యర్థుల పట్ల ఈ నిబంధన శాపంగా మారింది. పరీక్షా కేంద్రాల వద్దకు పలువురు అభ్యర్థులు ఒకటీ రెండు నిముషాల ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.

కాగా వారు అధికారులను ఎంతగా బతిమాలినప్పటీకి లోపలికి అనుమతించలేదు.జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో 3298మంది హాజరు కాగా దాదాపు వంద మంది విద్యార్థులు గైరుహాజర్ అయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments