విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట!గ్రామాల్లో ఇంటింటి ప్రచారం..ఉపాధ్యాయులకు లక్ష్యాల నిర్దేశం.. కరపత్రాలు, బ్రోచర్ల పంపిణీ విద్యార్థుల కోసం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వ్యవహారం ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. పిఆర్వోలతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. ఆ లక్ష్యాలను సాధించేందుకు వారు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు.
తమ పాఠశాల ప్రత్యేకతలు, విశిష్టతలను వివరిస్తూ ఆకర్షణీయమైన బ్రోచర్లు, కర పత్రాలను పంచుతున్నారు. పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరు 10 నుంచి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు ఉపాధ్యాయులకు టార్గెట్లు విధించాయి.
దీంతో వారు ఉదయం 7 నుంచే ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. విద్యార్థులతల్లిదండ్రులతోమాట్లాడు తున్నారు. తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించాలనే ఆలోచన కూడా ఇవ్వకుండా పాఠశాలలో అడ్మిషన్లు అయిపోతున్నాయంటూ ఊదరగొడుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొర బడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసినజీవోలు అమలు చేయడం లేదు. అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా ర్హతలు లేని వారితో బోధన చేయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
బిఈడి పూర్తిచేసిన వారే విద్యాభ్యాసం చేయాల్సి ఉండగా చాలా పాఠశాలలో విద్యార్హత లేని వారితో చదువులు కొనసాగిస్తున్నారు. పలు పాఠశాలల్లో నిబంధనలకు విరు ద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనె ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
