ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి నుంచి రుద్రారం గ్రామానికి ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురికి జరిగిన ప్రమాద వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
ఎల్లారెడ్డి నుంచి రుద్రారం గ్రామానికి వెళ్తున్న ఆటో ఎస్బిఐ బ్యాంక్ ముందు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో డ్రైవర్ ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో నిజాంసాగర్ గ్రామానికి చెందిన సుమలత, రజిత ,ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సంగవ్వ, మల్కాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ ,శకుంతల ,షేర్లచంద్రయ్య లకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారినిస్థానికులు చికిత్స కొరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సలు అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
